ఒకే ప్లాట్‌కు రెండు రిజిస్ట్రేషన్లు జరిగితే అసలు ఓనర్ ఎవరు? | First in Time First in Right Explained

🏡 ఒకే ప్లాట్‌కు రెండు రిజిస్ట్రేషన్లు – నిజంగా ఎవరిది ఆ స్థలం?

భూమి కొనుగోలు చేసే సమయంలో చాలా మంది చేసే పెద్ద పొరపాటు పూర్తి సమాచారం లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం.ఇటీవల చాలా చోట్ల వినిపిస్తున్న సమస్య

–👉 ఒకే ప్లాట్ / ఒకే స్థలం రెండు సార్లు రిజిస్ట్రేషన్ అవడం.ఇలా జరిగితే అసలు ఓనర్ ఎవరు?మొదట కొనుగోలు చేసినవారా?లేదా ప్రస్తుతం పొజెషన్‌లో ఉన్నవారా?ఈ సందేహానికి సమాధానం చట్టంలో చాలా క్లియర్‌గా ఉంది.ఈ బ్లాగ్‌లో మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు.

⚖️ “First in Time, First in Right” అంటే ఏమిటి?భారత చట్టం ప్రకారం (Property Law) ఒక ముఖ్యమైన సూత్రం ఉంది:👉 First in Time, First in Rightఅంటే,ముందుగా తేదీ & సమయం (Date & Time) తో ఎవరి రిజిస్ట్రేషన్ ఉంటుందోచట్టపరంగా ఆయనే అసలు ఓనర్అదే ఆస్తి తర్వాత ఇంకొకరికి రిజిస్ట్రేషన్ అయినా కూడా,మొదటి రిజిస్ట్రేషన్‌కే పూర్తి హక్కు ఉంటుంది.

🧾 ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం : 👉 ఒక ప్లాట్‌నుPerson A – ఉదయం 10:00 AMకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడుఅదే ప్లాట్‌నుPerson B – మధ్యాహ్నం 4:00 PMకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడుఇక్కడ ఎవరు అసలు ఓనర్?✅ Person Aఎందుకంటే అతని రిజిస్ట్రేషన్ ముందుగా జరిగింది.👉 Person B దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నా కూడా,👉 అది చట్టపరంగా Invalid / Void అవుతుంది.

🤔 మరి రెండో కొనుగోలుదారుడి పరిస్థితి ఏంటి? ఇక్కడ చాలా మంది అడిగే ప్రశ్న ఇదే.❌ “నేను డబ్బులు ఇచ్చాను”❌ “నేను పొజెషన్‌లో ఉన్నాను”❌ “ఇల్లు కూడా కట్టేశాను”ఇవి చట్టంలో ఓనర్ నిర్ణయానికి సరిపోవు.👉 Ownership అనేది రిజిస్ట్రేషన్ తేదీ & సమయం ఆధారంగా నిర్ణయించబడుతుంది.👉 Possession (పొజెషన్) మాత్రమే ఆధారంగా హక్కు రాదు.

🚨 అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది?ఈ రకమైన సమస్యలు ఎక్కువగా కింది కారణాల వల్ల వస్తాయి:

1️⃣ EC (Encumbrance Certificate) చెక్ చేయకపోవడంచాలా మంది 10–15 ఏళ్ల EC మాత్రమే చూస్తారు.కానీ కొన్ని కేసుల్లో పాత రిజిస్ట్రేషన్లు మిస్ అవుతాయి.

2️⃣ Seller మీద అతి నమ్మకం“అన్నీ క్లియర్ సార్” అన్న మాటలు నమ్మడం.

3️⃣ Legal Opinion తీసుకోకపోవడంఒక న్యాయవాది ద్వారా డాక్యుమెంట్స్ వెరిఫై చేయించకపోవడం.

4️⃣ Low Budget / Urgent Purchaseత్వరగా కొనాలి అన్న ఆతురతలో తప్పులు.✅ భూమి కొనేముందు తప్పకుండా చేయాల్సినవిమీరు భవిష్యత్తులో ఈ సమస్యలో పడకూడదంటే:✔️ కనీసం 30 ఏళ్ల EC చెక్ చేయండి✔️ Parent Documents చూడండి✔️ Legal Opinion తప్పకుండా తీసుకోండి✔️ ఒకే రోజు రెండు రిజిస్ట్రేషన్లు ఉన్నాయా అని చూసుకోండి✔️ Seller గత లావాదేవీలను పరిశీలించండి🏁 చివరగా ఒక ముఖ్యమైన మాట👉 ఒకే ప్లాట్‌కు రెండు రిజిస్ట్రేషన్లు జరిగితే –ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారే అసలు ఓనర్👉 తర్వాత చేసిన రిజిస్ట్రేషన్ చట్టపరంగా చెల్లదు.భూమి కొనుగోలు జీవితంలో ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే చేస్తాం.కానీ ఒక చిన్న నిర్లక్ష్యం జీవితాంతం కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి తెస్తుంది.

📌 Follow & Contactఇలాంటి రియల్ ఎస్టేట్ అవగాహన సమాచారం కోసం

👉 Dreams Hideout ను Follow చేయండి📺 YouTube | 📸 Instagram | 📘 Facebook

📞 నెల్లూరు లో ఏదైనా ప్రాపర్టీ సమాచారం కోసం కాల్ చేయండి:91775 61165

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top