నా పేరు కృష్ణ కుమార్. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేశాను. మన జీవితాన్ని మెరుగుపర్చే మార్గాలు, కుటుంబానికి భరోసా కలిగించాలనే కోరికతో రాత్రింబవళ్ళు కష్టపడ్డాను. కానీ ఓ దశలో నాకు ఒక విషయం అర్థమైంది – నిజమైన భద్రత ఉద్యోగంతో కాక, సరైన నిర్ణయాలతో వస్తుంది.
సగటు మనిషి జీవితంలో, ఆరోగ్యం, ఆహారం, ఆస్తి, ఆనందం అనే నాలుగు మూలాలు తప్పక కావాలి. కానీ చాలా మంది ఆరోగ్య బీమా మరియు టర్మ్ ఇన్సూరెన్స్ మరియు ఆస్తి వంటి భద్రతల గురించి ఆలోచించకుండా జీవిస్తున్నారు . అలాగే, చాలా మంది నాణ్యమైన ఆహారం తీసుకోవడంలో కూడా వెనకబడిపోతున్నారు.
అది చూసి నాకు బాధ కలిగింది. అదే సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది – “Dreams Hideout” అనే ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించాలి. ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ మాత్రమే కాదు. ఇది ఒక దిశ. ఒక మార్గదర్శకం. సగటు మనిషికి జీవిత భద్రత ఎలా వస్తుందో తెలియజేయడం కోసం.
🌱 Dreams Hideout లక్ష్యం:
- భద్రమైన భవిష్యత్తు కోసం: స్థిరాస్తి పెట్టుబడులపై సరైన దారి చూపడం
- ఆరోగ్యం కోసం Health & Term Insurance గురించి అవగాహన కల్పించడం
- ఆనందం కోసం: జీవితాన్ని ఆనందంగా గడిపే మార్గాలను తెలియజేయడం
- నాణ్యమైన జీవితం కోసం మంచి ఆహారం గురించి తెలియజేయడం
Dreams Hideout’s vision and mission, focusing on securing families and the future.
ఈ వెబ్‌సైట్ ఒక రోజులో తయారవదు. అలాగే మన జీవితం కూడా ఒక్కరోజులో మారదు. అందుకే నేను నిర్ణయించుకున్నాను – ప్రతి రోజు ఇందులో ఒక చిన్న మార్పు చేస్తాను. ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఈ వేదికను అందరికీ ఉపయోగపడేలా చేస్తాను.
మీరు కూడా నాతో పాటు ఈ ప్రయాణంలో భాగం అవ్వండి. మనం కలలను వెంటాడుదాం – ఒక్కొక్కటిగా నిజం చేద్దాం.

మీ
కృష్ణ కుమార్
Founder, Dreams Hideout.