B.TECH పూర్తయింది, ఉద్యోగం వచ్చింది, మొదటి జీతం వస్తే చాలా మందికి మొదటి ఆలోచన – “ఒక బైక్ తీసుకుందాం”, “ఒక మంచి కారు కొందాం!”
అది సహజం. కానీ మనం ఒక చిన్న ఆలోచన చేస్తే – కారుకంటే ముందుగా ఒక ప్లాట్ తీసుకోవడం మన జీవితానికి ఎంత లాభదాయకమో అర్థమవుతుంది.
1. కారు వాల్యూ తగ్గుతుంది – భూమి విలువ పెరుగుతుంది
కారు కొనగానే రెండో చేతి వస్తువు అవుతుంది. సంవత్సరానికి 10-15% వాల్యూ తగ్గుతుంది. కానీ ప్లాట్ కొంటే సంవత్సరానికి కనీసం 10-20% విలువ పెరగొచ్చు.
2. కారు ఖర్చే ఖర్చు – ప్లాట్‌లో ఆదాయం అవకాశం
కారుకి పెట్రోల్, సర్వీస్, ఇన్సూరెన్స్ ఖర్చులు తప్పవు. ప్లాట్ అయితే భద్రతగా ఉండి, అవసరమైతే పక్కా రెంటల్ ఇన్కమ్‌కు మారుతుంది.
3. ఇది బాధ్యతగా, అది చూపు కోసం
కారు కొంటే కాలనీలో పేరు ఉంటుంది, కానీ అది లైఫ్ బిల్డ్ చేయదు. ప్లాట్ కొంటే భవిష్యత్ కు పెట్టుబడి అవుతుంది – responsibility grow అవుతుంది.
4. పట్టణాలలో ప్లాట్ల ధర వేగంగా పెరుగుతోంది
ఇప్పటి విలువ రూ. 3,000/Sq.Yard అంటే రెండేళ్లలో అది రూ. 5,000/Sq.Yard కావడం సాధారణం. కారు అయితే రెండేళ్లలో విలువ తగ్గిపోతుంది
5. ఆస్తి కొనడం ఎప్పుడూ మొదట ఉండాలి
కారుకి 5 లక్షలు ఖర్చు పెట్టేవారు అదే డబ్బుతో 1 ప్లాట్ కొనొచ్చు. తర్వాత EMIతో కారు తీసుకోవచ్చు. భూమి మాత్రం వెనక తిరిగి రావడం కష్టం.
ముగింపు:
ఆకర్షణకు లోనై కారుకి ముందుగా ఖర్చు చేయకండి. మొదటి ఆదాయం, మొదటి పెట్టుబడి భూమిలో పెట్టండి. మీ భవిష్యత్ భద్రంగా ఉండాలంటే ఇది బెస్ట్ స్టెప్.
